Abn logo
Sep 27 2020 @ 22:41PM

తెలంగాణలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఇక నుంచి..

Kaakateeya

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మారిన విషయం తెలిసిందే. కొత్తగా ఇంఛార్జి బాధ్యతలు చేపట్టిన మాణికం ఠాగూర్ స్పీడ్ పెంచారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఉత్సాహంలో దూకుడు పెరిగింది. వరుస కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతినిత్యం నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 28న రాజ్‌భవన్‌, కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. 29న నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు. 30న జూమ్ ఆప్‌లో కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. వ్యవసాయ వ్యతిరేక బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలంటూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement