Abn logo
Mar 26 2020 @ 12:13PM

పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో తెలంగాణ విద్యార్థులు, యువకులు చిక్కకుపోయారు. విద్యార్థులను, యువకులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రాలేక, అక్కడ ఉండలేక, హాస్టల్‌లో భోజనం లేక అవస్థలుపడుతున్నారు. ప్రభుత్వం చొరవచూపి తమ పిల్లలను తీసుకురావాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement