Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 12 2021 @ 10:12AM

14న తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం రెండురోజుల్లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఈ నెల లోపు పంటలసాగుపై అవగాహన, ఉద్యోగాలభర్తీపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.


ఈనెల 14న తెలంగాణ కేబినెట్ జరిగే అవకాశముంది. ఉద్యోగలభర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్లకు కేబినెట్‌లో పచ్చజెండా ఊపనున్నారు. దాదాపు 70వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎప్పటిలోగా ఈ నియామకాలు పూర్తి చేయాలన్నదానిపై కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement