Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఏ దేశంలో ఉందో తెలుసా?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదని అడిగితే.. అందరూ అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలలో ఉన్న నగరాల పేర్లను చెబుతారు. కానీ ఆ నగరం ఈ దేశాలలో లేదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం యూదుల దేశం ఇజ్రాయెల్‌లో ఉంది. దాని పేరు టెల్ అవీవ్. 2021 సంవత్సరానికి గాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్‌లో టెల్ అవీవ్ ప్రపంచంలోని సంపన్నులు నివసించే లండన్, పారిస్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, జ్యూరిచ్, సింగపూర్ లాంటి నగరాలని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.


టెల్ అవీవ్ అనేది ఇజ్రాయెల్ ప్రధాన నగరం. 1909లో యూదు వలసదారులు ఈ నగరాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే టెల్ అవీవ్‌లో ఉన్న జీవన వ్యయ సూచీ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల టెల్ అవీవ్ ప్రపంచంలో నివసించడానికి అత్యంత ఖరీదైన నగరంగా మారింది. టెల్ అవీవ్ జాతీయ కరెన్సీ షెకెల్, డాలర్‌తో పోలిస్తే షెకెల్ బలపడటంతో పాటు రవాణా, కిరాణా వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకింది.


టెల్ అవీవ్ తర్వాతి స్థానాల్లో పారిస్, సింగపూర్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. జ్యూరిచ్ నాలుగవ స్థానంలో ఉంది. హాంకాంగ్ ఐదో స్థానంలో, న్యూయార్క్ ఆరో స్థానంలో, జెనీవా నగరం ఏడో స్థానంలో నిలిచాయి. టాప్ 10 ఖరీదైన నగరాల జాబితాలో కోపెన్‌హాగన్, లాస్ ఏంజెల్స్, ఒసాకా నగరాలు ఎనిమిది, తొమ్మిది,10వ స్థానాల్లో నిలిచాయి. 


పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు గత సంవత్సరం ఖరీదైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. మరోవైపు ప్రపంచంలో అత్యంత చౌక నగరాల జాబితాలో సిరియా దేశ రాజధాని డమాస్కస్ నిలిచింది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement