Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి

వల్లూరు, నవంబరు 27: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నా రు. శనివారం గంగాయపల్లెలోని ఆదర్శ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఆదర్శ పాఠశాలలో ఉన్న అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను పరిశీలించారు. అక్కడ విద్యార్థులు చేస్తున్న ప్రయోగాలను పరిశీలించారు. అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానాలు తెలుసుకొన్నారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా సైన్స్‌పై మరింత అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలా కల్పించినప్పుడే వారిలోని పరిజ్ఞానం మరింత పెరిగి విద్యార్థుల ఉన్నతికి అది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్థానిక ఉపాధ్యాయులతో లెసన్‌ ప్లానింగ్‌ గురించి చర్చించారు. విద్యార్థులకు మంచి బోధన అందిస్తే వారి అభివృద్ధితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడతారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్‌ దిలీ్‌పకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement