Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థులకు కఠిన శిక్షలు.. పీఈటీ తీరుపై ఆగ్రహం

విజయవాడ: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నారని విద్యార్థుల పట్ల పీఈటీ ఉపాధ్యాయుడు మడక ప్రసాద్ కఠినంగా వ్యవహరించారు. స్కూలు ఆవరణలో మోకాళ్లపై విద్యార్థులను నడిపించారు. ఈ ఘటన గుడివాడ ఎస్.పి.ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఈటీ శారీరకంగా హింసిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదస్పదమవుతోంది. ఇక పీఈటీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
Advertisement