Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో..: కాల్వ శ్రీనివాసులు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు అమానుషమని ఆయన మండిపడ్డారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ కౌరవసభను తలపించేలా ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి ప్రశ్నించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మాట్లాడిన వారిని బజారులో పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారని కాల్వ అన్నారు. పిచ్చికుక్కల కంటే హీనంగా వైసీపీ నాయకులు మాట్లాడారని, కొడాలి నాని సంస్కార హీనుడు.. లుచ్చా రాజకీయం చేస్తున్నాడని కాల్వ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కష్టాలు వచ్చినా నిగ్రహం కోల్పోలేదని, వైసీపీ మంత్రుల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు. వ్యక్తి దూషణ, కుటుంబ సభ్యులపైన అభాండాలు వేస్తుంటే చూస్తు ఊరుకోమని కాల్వ హెచ్చరించారు.

Advertisement
Advertisement