Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్‌ షోలో టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్

విజయవాడ: టీడీపీ నేతలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు చిన్నపాటి క్లాస్ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం నాటి రోడ్ షో సందర్భంగా అభ్యర్థులను ప్రచారం చేస్తూ.. నేతలను వెనక్కి వెళ్లాలని సూచించారు. మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను పక్కకు జరిపి మరీ అభ్యర్థులను ముందుకు తీసుకు వచ్చారు. వాళ్లను పరిచయం చేయాలని... వాళ్లే అభ్యర్థులని.. మీరు కాదంటూ సుతిమెత్తగా తెలిపారు. వారిని చూసే నాలుగైదు ఓట్లు ఎక్కువ వస్తాయన్నారు. నాయకులు ఎక్కడ తగ్గాలి... అభ్యర్థులు ఎక్కడ ముందుండాలనేది తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తాను పవిత్రమైన కార్యక్రమంపై ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు. 


Advertisement
Advertisement