Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ బృందాల పర్యటన

అమరావతి: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ బృందాలు పర్యటించనున్నాయి. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాలలోని టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలతో సహా నెల్లూరులోని పలు ప్రాంతాలు  జలదిగ్భందంలో చిక్కుకున్నాయని తెలిపారు. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలన్నారు. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం కంటే ముందే సేవలు అందించేందుకు టీడీపీ రంగంలోకి దిగిందని తెలిపారు. సీనియర్ నేతలతో జిల్లాల వారిగా చంద్రబాబు కమిటీలు వేశారు.


కడప జిల్లా

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,

కాలువ శ్రీనివాసులు,

అమర్నాథ్ రెడ్డి,

నిమ్మల కిష్టప్ప


చిత్తూరు జిల్లా

నక్కా ఆనంద్ బాబు,

అనగాని సత్యప్రసాద్,

వెంకటరత్నం


నెల్లూరు జిల్లా

డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి,

బీసీ జనార్థన్ రెడ్డి,

ఉగ్ర నరసింహారెడ్డి,

దామచర్ల సత్య


అనంతపురం జిల్లా

ఎన్.ఎమ్‌.డీ ఫరూఖ్,

కె.ఈ ప్రభాకర్,

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Advertisement
Advertisement