Abn logo
Sep 25 2021 @ 14:42PM

భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు: అచ్చెన్న

అమరావతి: 27న రైతు సంఘాల భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమని వ్యాఖ్యానించారు. బంద్‌లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సచివాలయాలను సందర్శిస్తానన్న సీఎం జగన్‌ దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన దిగారు. ఆందోళనలో భాగంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.


ఇవి కూడా చదవండిImage Caption