Abn logo
Jun 19 2021 @ 18:08PM

కొడాలి నానీకి పిచ్చి పట్టిందేమో: దివ్యవాణి

అమరావతి: మంత్రి కొడాలి నానీ మాట తీరు, ప్రవర్తన, నడవడిక చూసిన వారంతా ఆయనకు పిచ్చిపట్టిందేమోనని అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. నారా లోకేశ్ మాటతీరు, శరీర తీరు, చూశాక నానీకి మతిపోయినట్టుందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలైతే సరికొత్త లోకేశ్‌ను చూసి, స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఉన్నాడంటున్నారని ఆమె పేర్కొన్నారు. తండ్రి వయసున్న చంద్రబాబుని, లోకేశ్‌ని విమర్శిస్తే, బూతులు తిడుతున్న నానీ, ముందు తానేం తింటున్నాడో తెలుసుకోవాలని నానీకి దివ్యవాణి హితవు పలికారు. హూ కిల్డ్ బాబాయి అనే ప్రశ్నకు, కోడికత్తి ఘటనకు సమాధానం చెప్పగల ధైర్యం కొడాలికి ఉందా అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్యకేసు విచారణ వేగవంతమైన తరుణంలోనే, కేసుతో సంబంధమున్నవారంతా ఆసుపత్రుల్లో ఎందుకు చేరుతున్నారో నానీ చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.

 వివేకానందరెడ్డి కుమార్తె సునీత  ఈ రాష్ట్రంలో తనకు రక్షణ లేదన్న వ్యాఖ్యలపై నానీ ఏం చెబుతాడని ఆమె నిలదీశారు. గతంలో చంద్రబాబునాయుడు రూ.6లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మొరిగిన వారంతా ఇప్పుడెందుకు నోరెత్తడం లేదో నానీకి తెలుసా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి, అమరావతి భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ అన్నగొంతులు ఇప్పుడెందుకు మూగబోయాయో నానీయే చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.