Abn logo
Oct 25 2020 @ 16:21PM

మంగళగిరి అంబేద్కర్ సెంటర్‌లో టీడీపీ, ప్రజాసంఘాల నిరసన

Kaakateeya

గుంటూరు: మంగళగిరి అంబేద్కర్ సెంటర్‌లో టీడీపీ, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. కృష్ణాయపాలెం రైతులను తక్షణమే విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో 8 మంది రాజధాని రైతులు ఉన్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ, ప్రజాసంఘాల నాయకులు నినాదాలు చేశారు. రాజధాని పరిధి గ్రామమైన కృష్ణాయపాలెం కు చెందిన 11 మంది రైతులపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మూడు రాజధానులు, 30 లక్షల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని రాజధానిలో దీక్ష చేపట్టేందుకు ఆటోలలో వస్తున్న వ్యక్తులను సదరు రైతులు కృష్ణాయపాలెం వద్ద ఆపేశారు. బయటి ఊరి వాళ్లకు రాజధాని గ్రామాల్లో పని ఏంటని ప్రశ్నించారు. దీంతో వారు రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మంది రైతులపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement