Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాబు అధ్యక్షతన నేడు టిడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

అమరావతి: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ సంస్థగత నిర్మాణంపై చర్చించనున్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం వంటి అంశం కూడా చర్చకు రానుంది. అధికారపార్టీ నేతల వ్యక్తిగత దూషణలు, తుపాను మరణాలు, పంట, ఆస్తి నష్టాలు, ముందస్తు చర్యల్లో ముఖ్యమంత్రి విఫలం, రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం, పంచాయతీ నిధుల దారిమళ్లింపు, మున్సిపల్ ఎన్నికల విశ్లేషణ, జగన్ రెడ్డి కేంద్రీకృత విధానాలు, వికేంద్రీకరణకు తూట్లు, సోలార్ ఒప్పందంలో లక్ష కోట్ల స్కాంకు తెరతీయడం, బీసీ జనగణన పేరుతో మోసం, ఆర్థిక సంక్షోభం, వరి వేయవద్దంటూ క్రాఫ్ హాలిడే, సంస్థాగత నిర్మాణ బలం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, పార్టీ నేతలపై కేసుల వంటి అంశాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement
Advertisement