Abn logo
Oct 16 2021 @ 17:26PM

సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల మరో లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల మరో లేఖ రాశారు. ఎమ్మెల్యేలు రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, సాంబశివరావు లేఖ రాశారు.  ప్రకాశం జిల్లా ప్రగతి, సమస్యలపై సీఎం శ్రద్ధ వహించడం లేదన్నారు. గతంలో రాసిన లేఖల్లో రాజకీయం వెతికారు తప్ప ఆవేదనని అర్థం చేసుకోలేదని చెప్పారు. కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం "వెలుగొండ"కి అన్యాయం చేస్తున్నారు? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టుని గెజిట్‌లో చేర్చేలా కేంద్రంతో మాట్లాడాలని చెప్పారు. వెలుగొండకు అన్యాయం చేయొద్దని ప్రతి రైతు గుండె గర్జిస్తోందన్నారు. ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం, వర్సిటీ నిర్మాణం ఎప్పుడు? నిర్మిస్తారని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టును ఎందుకు దారి మళ్లిస్తున్నారో చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్ట్ పనులను పునఃప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో సాగునీరు, ఎరువులు అందేలా చూడాలని లేఖ ద్వారా కోరారు. 


ఇవి కూడా చదవండిImage Caption