ఉయ్యూరు, జనవరి 17 : గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పోరా టాలు చేసిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఉద్యమాలు చరిత్రలో నిలిచి పోతాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాజేంద్రప్రసాద్ రాజకీయ ప్రస్థానం పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా కూనపరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఆదివారం 6వ వార్డులో సిల్వర్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిరు కానుకలను పంపిణీ చేశారు. పూల, సోమేశ్వరరావు, అజ్మతుల్లా, శివ, బాజాని తదితరులు పాల్గొన్నారు.