Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్బన్ ఎస్పీని కలిసిన టీడీపీ నేతలు

గుంటూరు: టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్‌ని టీడీపీ నేతలు కలిశారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మంతెనరాజు, ఆలపాటి రాజా, క్కా ఆనంద్‌బాబు, శ్రావణ్ కుమార్ ఎస్పీని కలిశారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఘటనపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే ప్రైవేట్‌ కేసు వేస్తామని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.


మాజీమంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంపై దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. తమపై కేసులు పెట్టారని, కానీ దాడి చేసినవాళ్లపై కేసులు లేవన్నారు. సీసీ ఫుటేజ్ ఇవ్వలేదని పోలీసులు సాకులు చెప్తున్నారని ఆయన అన్నారు.


నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. 


Advertisement
Advertisement