Abn logo
Sep 28 2020 @ 14:47PM

టీడీపీ కడప జిల్లా రథసారథులు వీరే

Kaakateeya

కడపకు లింగారెడ్డి.. రాజంపేటకు శ్రీనివాసరెడ్డి

పార్లమెంట్‌ అధ్యక్షులను ఎంపిక చేసిన అధినేత చంద్రబాబు

సమన్వయకర్తగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

సీనియర్లతో సమన్వయ కమిటీ


(కడప- ఆంధ్రజ్యోతి): టీడీపీ అధికారం కోల్పోయిన ఏడాదిన్నర తరువాత సం స్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ  అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బలమైన పోరాటం చేసేలా నాయకత్వాన్ని సన్నద్ధం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే తొలిసారిగా పార్లమెంట్‌ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేశారు. జిల్లాలో కడప లోక్‌సభ స్థానం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి (వాసు)లను ఎంపిక చేశా రు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తగా నియమించారు. కార్యకర్తలు, సీనియర్‌ నాయకులను సమన్వయం చేస్తూ ఓపక్క పార్టీ బలోపేతం.. మరోపక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం కొత్తగా ఎంపికైన అధ్యక్షులకు కత్తిమీద సాములాంటిదే. 


లింగారెడ్డికి కలిసొచ్చిన సీనియారిటీ

కడప పార్టమెంట్‌ పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆశించారు. అధినేత చంద్రబాబును కలసి తన మనసులో మాటను కూడా చెప్పారు. మొదట్లో బీటెక్‌ రవి పేరే వినిపించిం ది. కాగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డికి గతంలో జిల్లా పా ర్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, సీనియార్టీ కలసివచ్చింది. తొలిసారిగా చేపట్టిన పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుల ఎంపికలో స్థానం దక్కింది. కడపకు లింగారెడ్డిని అధినేత చంద్రబాబు ఎం పిక చేశారు. 1985 నుంచి ఇప్పటి వరకు 33 ఏళ్లుగా లింగారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1985లో ప్రొద్దుటూరు అర్బన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గా పనిచేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది. 2009 నుంచి 2014 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుం చి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 2 వేల ఓట్ల తో ఓటమి చెందిన ఆయన 2009లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.


ఆ ఎన్నికల్లో జిల్లా నుంచి ఎంపికైన టీడీపీ ఏకైక ఎమ్మెల్యే లింగారెడ్డి. కాగా ఈ నియోజకవర్గం పరిధిలో కడప, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వే లు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరితే.. మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. అక్కడ కార్యకర్తలకు అండగా నిలిచే బలమైన నాయకుడిని ఎంపిక చేయడం ఆయనకు సవాల్‌ లాంటిదే. అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తాను, అధినేత చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని లింగారెడ్డి వివరించారు. 


రాజంపేట పార్లమెంటుకు వాసు ఎంపిక

రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎంపీ మిఽథున్‌రెడ్డిని ఢీకొట్టాలంటే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి (వాసు)కే సాధ్యమని అధిష్ఠానం భావించింది. జిల్లా అధ్యక్ష హో దాలో పనిచేసినా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వాసును రాజం పేట పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడిగా అఽధినేత చంద్రబాబు ఎంపి క చేసినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలు నుంచి ఇప్పటి వరకు ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లా పార్టీ అధ్య క్షుడిగా పనిచేసిన తనకు పార్లమెంట్‌ స్థాయిలో కాకుండా రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వాలని వాసు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి నట్లు తెలిసింది. కాగా.. వాసు సొంత నియోజకవర్గం రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది.


లక్కిరెడ్డిపల్లి నియోజక వర్గం నుంచి వాసు తండ్రి ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి ఆరు పర్యాయా లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన సోదరుడు ఆర్‌.రమేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డిని ఢీకొట్టి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌ రాయులు లాంటి సీనియర్‌ నాయకులకు కులుపుకుని పార్టీని బలోపేతం చేయడంలో శ్రీనివాసరెడ్డి సమర్థవంతంగా పనిచే స్తారనే విశ్వాసంతో చంద్రబాబు వాసును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


కాగా ఈ నియోజకవర్గం పరిధి లో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గాలు వస్తాయి. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలను కలుపు కుని రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి కీలకపాత్ర పోషించాల్సి అవసరం ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతు న్నానని శ్రీనివాస రెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 


నమన్వయకర్తగా మాజీ మంత్రి సోమిరెడ్డి

కడప, రాజంపేట పార్లమెంట్‌ పార్టీ సమన్వయకర్తగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని చంద్రబాబు నియమించారు. జిల్లా నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2014 ఎన్నికల వరకు కడప, రాజంపేట నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు. పార్టీ అధికారం చేపట్టాక రెండేళ్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పనిచేశారు. 2016లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేసి బీటెక్‌ రవి ఎమ్మెల్సీగా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ బలోపేతం కోసం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. 


సీనియర్లతో జిల్లా సమన్వయ కమిటీ

పార్టమెంట్‌ పార్టీ అధ్యక్షులను అధినేత ఎంపిక చేసినా.. జిల్లాలో పార్టీ కీలక నిర్ణయాలు అమలు చేసేందుకు సీనియర్‌ నాయకులతో జిల్లా సమన్వయ కమిటీ త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ కమిటీలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలకు చెందిన ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, కమలాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మైదుకూరు ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, రాజంపేట ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌ రాయులు, బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, రాయచోటీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌రెడ్డి, కడప ఇన్‌చార్జి అమీర్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, రెడ్యం వెంకటసు బ్బారెడ్డి  తదితరులను నియమించే అవకా శం ఉంది. కాగా.. అన్ని సామాజిక, రాజకీ య వర్గాలను కలుపుకుని పార్లమెంట్‌ పార్టీ కమిటీ, అనుబంధ సంఘాల కమిటీ ఎంపికపై కొత్త అధ్యక్షులు దృష్టి సారించాల్సి ఉంటుంది. 





Advertisement
Advertisement
Advertisement