Advertisement
Advertisement
Abn logo
Advertisement

భువనేశ్వరిపై విమర్శలు సిగ్గుచేటు: Ravi kumar

శ్రీకాకుళం: అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేత రవికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భువనేశ్వరి ఏనాడూ బయటకు రాలేదని... అలాంటి మహిళపై విమర్శలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. స్పీకర్ తమ్మినేని ఆ పదవికి అనర్హుడన్నారు. చంద్రబాబు కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని అన్నారు. కౌరవుల మాదిరిగా వైసీపీ నేతలకూ దగ్గర పడిందని తెలిపారు. చంద్రబాబు తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే వివేకా హత్యపై అసెంబ్లీలో చర్చించాలని సవాల్ విసిరారు. చంద్రబాబును సీఎంను చేయటానికి కార్యకర్తలమంతా కసిగా పనిచేస్తామన్నారు. వివేకా హత్య కేసు పాత్రధారులే కాదు సూత్రదారులూ బయటికి రావాలని అన్నారు. వివేకా హత్యకు రూ.40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కూనరవికుమార్ ప్రశ్నించారు. 


Advertisement
Advertisement