ఒంగోలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నివర్ తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిలో లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం కారంచేడు సమీపంలో నల్లకట్ట డ్రైనేజి కాలువను పరిశీలిస్తారు. అలాగే స్వర్ణ సమీపంలోని వరద ముంపునకు గురైన మిరప పైరును ఆయన పరిశీలించనున్నారు. అటు నుంచి పోతినవారిపాలెం, దగ్గుబాడు, పూసపాడు గ్రామాల్లో పర్యటించి తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిశీలిస్తారు. ఆపై పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద దెబ్బతిన్న వైట్బర్లి పొగాకు పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖిలో లోకేష్ పాల్గొననున్నారు.