Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈపూరులో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోరుబాట

గుంటూరు: జిల్లాలోని ఈపూరులో మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు పోరుబాటకు దిగారు. గృహ హక్కు కోసం ఒన్ టైం సెటిల్మెంట్‌పై టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది. ఎస్సీ, బీసీ కాలనీలలో ఇంటింటికి తిరిగి లబ్దిదారులతో జీవీ ముఖాముఖి నిర్వహించారు. ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంటల పోయి తినటానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందారు. ప్రజలు ఎవ్వరూ కూడా రూపాయి కట్టవద్దని...టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా గృహ హక్కు కల్పిస్తామని ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement