Abn logo
Oct 23 2021 @ 14:14PM

జనాగ్రహదీక్షల్లో జగన్‌పై ఉన్న జనాగ్రహం బట్టబయలైంది: GV

అమరావతి: ముఖ్యమంత్రి పిలుపుతో నిర్వహించిన జనాగ్రహదీక్షల్లో జగన్‌పై ఉన్నజనాగ్రహం బట్టబయలైందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టుమని 20 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జనాగ్రహ దీక్షలు జరగలేదన్నారు. చంద్రబాబు దీక్షను తప్పుపడుతున్న తాడేపల్లి పాలేరు సజ్జల సీఎం పదవి కోసం గోతికాడనక్కలా ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి డ్రగ్స్‌లో మునిగితేలుతూ, పబ్జీలు ఆడుకుంటుంటే సజ్జల షాడోసీఎంలా పెత్తనంచలాయిస్తున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకుపోతాడా.. ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా అని నక్కినక్కి చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వల్లభనేనీ వంశీ భాషను ఆయన తల్లి, కట్టుకున్నభార్యే అసహ్యించుకుంటున్నారన్నారు.


పశువుల కన్నా హీనంగా మాట్లాడుతున్న వంశీ, రాబోయే రోజులను గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిదని హితువుపలికారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడు చెప్పుదెబ్బలతో సత్కారంచేద్దామా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల చలామణీపై, పొరుగు రాష్ట్రాల పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాను మత్తులో జోగుతూ, యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్‌గామార్చారన్నారు. తాను జైలుకెళ్లి వచ్చాను కాబట్టి, తనను ప్రశ్నించేవారు కూడా జైళ్లలో మగ్గాలన్న దుర్మార్గపు ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...