Abn logo
Sep 21 2021 @ 12:07PM

జోగి రమేష్‌తో పోలీసులు కుమ్మక్కు: Dhulipalla

గుంటూరు: ఐపీఎస్‌లు బరితెగించి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధుల కంటే ఎక్కువగా  ఐపిఎస్‌లు మాట్లాడారన్నారు. పోలీసులు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని తెలిపారు. జోగి రమేష్‌తో పోలీసులు కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. గుంటూరు ఐపీఎస్‌లు ఖాకీ డ్రస్స్‌కు కళంకం తెస్తున్నారన్నారు. తమరు ఖాకీ డ్రస్స్‌లు వదిలి వైసీపీ చొక్కాలు వేసుకుంటే బాగుంటుందని ఆయన యెద్దేవా చేశారు. వైసీపీ నేతలతో పోలీసులు కుట్ర పన్ని చంద్రబాబు ఇంటిపై దాడి చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎస్పీ అమ్మి రెడ్జితో తమపై ఫిర్యాదు చేయించకుండా ఓ చిన్న ఏఎస్ఐని ఎందుకు బలి చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పని చేస్తుందా అనే అనుమానం కలుగుతుందన్నారు.


సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటనలో ఇంకా నిందితులను పూర్తి పట్టుకోలేదని ధూళిపాళ్ల మండిపడ్డారు. పాలడుగు సామూహిక అత్యాచారం జరిగి రెండు వారాలు గడుస్తున్న చర్యలు శూన్యమన్నారు. గుంటూరు జిల్లాలో పోలీసులు అధికారి పార్టీ నేతలకు దాసోహం అంటున్నారని అన్నారు. గుంటూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. గుట్కా వ్యాపారాలకు గుంటూరు జిల్లా నిలయంగా మారిందన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయని ఆయనప తెలిపారు. తెలంగాణ మద్యం ఏరులై పారుతుందన్నారు. గుంటూరు జిల్లాలో గంజాయి దొరకని ప్రాంతంలేదని చెప్పారు. గుంటూరు డిఐజీ, ఇద్దరు ఎస్పీలు నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తూ...ఈ ముగ్గురు ఐపీఎస్‌లకు అక్రమ వ్యాపారస్తుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption