Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాకినాడ పోలీసులతో ధూళిపాళ్ల ఆసక్తికర సంభాషణ

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత ధూళ్లిపాళ్ళ నరేంద్రకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కాకినాడ పోలీసులతో దూళిపాళ్ల  ఆసక్తికరమైన సంభాషణ చేశారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి తమకు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంభధించి ఏం  సమాచారం సేకరించారని నిలదీశారు. ‘‘డ్రగ్స్ కేసు ఎన్‌ఐఏ కదా దర్యాప్తు చేస్తున్నది... మీరు ఆధారాలు సేకరించడం ఏమీటి?... డ్రగ్స్ మాఫియాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలను ఎందుకు ప్రశ్నించలేదు?.. నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా జరగడంపై దోషులెవరన్నది తేల్చడం మీ బాధ్యత కాదా?...హెరాయిన్ విజయవాడ ఆసీట్రేడింగ్ పేరుతో వచ్చింది, పైగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి 9సార్లు జీఎస్‌టీ కట్టింది... దీనిపై విచారణ జరిపారా?’’ అంటూ ధూళిపాళ్ల ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement