Abn logo
Jun 4 2020 @ 09:32AM

రంగులు మార్చాల్సిందే: దేవినేని

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘రంగులు మార్చాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే పాలనాపరమైన ఆదేశాలేవైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి. కోర్టు తీర్పు పాటించకపోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. మెజారిటీ ఇచ్చిన అహంకారంతో పాలకులు మూర్ఖంగా వ్యవహరించి..రూ.వేలకోట్లు ప్రజా ధనం వృధా చేశారు. దీనికేనా ఒక ఛాన్స్‌ అడిగింది.. చెప్పండి జగన్‌ గారు’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement