Abn logo
Sep 22 2021 @ 11:14AM

డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోంది: బోండా ఉమా

అమరావతి: వైసీపీ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నేరస్థుల అడ్డాగా మార్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పట్టుబడిన రూ.72 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ బిగ్ బాస్ ఎవరంటే వైసీపీ భుజాలు తడుముకుంటోందన్నారు. డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఈ డ్రగ్స్‌పై ఎందుకు విచారణ చేయటంలేదని నిలదీశారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాలా డ్రగ్స్ సిండికేట్ అయిందన్నారు. డైరెక్టర్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు వైసీపీ తాట తీస్తారని తెలిపారు. తాడేపల్లి నుంచి ఢిల్లీలో డీఆర్ఐ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ కోసం పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టుబడిన 72 వేల కోట్ల హెరాయిన్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. నిర్వాహక బిగ్‌బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో త్వరలో తేలుతుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏపీ డ్రగ్స్ వ్యవహారమంతా తెలుసని చెప్పారు. టీడీపీ తరపున ఢిల్లీ వెళ్లి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి సంబంధిత అధికారులకు తెలుపుతామని బోండా ఉమా పేర్కొన్కారు.

ఇవి కూడా చదవండిImage Caption