Abn logo
Sep 21 2021 @ 09:36AM

వైసీపీ మద్దతుతోనే సుధాకర్ డ్రగ్స్ వ్యాపారం: Bonda uma

అమరావతి: రాష్ట్రాన్ని వైసీపీ నేరాంధ్రప్రదేశ్‌గా మార్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు.  ఎక్కడ స్కాం జరిగినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని తెలిపారు. 9 వేల కోట్ల హేరాయిన్ మూలాలు ఏపీలో ఉన్నాయని..దీనికి వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెరయిన్ నిందితుడు సుధాకర్ వైసీపీ మద్దతుతోనే డ్రగ్స్ వ్యాపారం పెట్టాడని ఆరోపించారు. ఇప్పటికే వేల కోట్లు ఎర్రచందనం వైసీపీ నాయకలు రోజూ విదేశాలకు అమ్ముకుంటున్నారన్నారు. వెంకటేశ్వరస్వామి వారికి భక్తులు ఇచ్చిన వెంట్రుకలు విదేశాలకు ఎగుమతి చేస్తూ పక్క రాష్ట్రల్లో దొరికిపోయారని తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు స్పెషల్ ఫ్లైట్‌లో విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు పది తరాలకు సరిపడా జగన్ హయాంలో సంపాదించారని బొండా ఉమా వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption