తిరుపతి: పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని చెప్పారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. ఏపీలో పోలీస్ వ్యవస్థ వైసీపీ వ్యవస్థలా పనిచేస్తోందని విమర్శించారు. పంచాయితీ నామినేషన్లు ఆన్లైన్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తే సిగ్గుచేటని...వెంటనే ఎన్నికలు జరపాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.