Abn logo
Sep 26 2021 @ 23:42PM

పెన్షన్లు పెంచుతామని.. పన్నులు పెంచారు

టీడీపీ పట్టణ, మండల, అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారం

వైసీపీ పాలనపై టీడీపీ నేతల ధ్వజం


జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 26: ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏమయ్యాయని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రశ్నించారు. టీడీపీ పట్టణ, మండ ల, అనుబంధ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిం చారు. ముందుగా రావూరి జంక్షన్‌ వద్ద టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో గన్ని  వీరాంజనేయులు, ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మేల్యే ముప్పిడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామన్నారని, అధికారంలోకి వచ్చి పన్నులు పెంచారని ఎద్దేవా చేశారు. ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా వేయబోమని చెప్పి ఇప్పుడు మోయలేనంత భారం మోపుతున్నారని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, నూనె, ఆర్టీసీ, ఇసుక, ఐరన్‌, సిమెంట్‌, రిజిస్ట్రేషన్‌, గ్యాస్‌, ఉప్పు అన్ని ధరలు పెంచడంతో ప్రజలు కుదేల య్యారన్నారు. మద్యపాన నిషేధం అంటూ మాయ చేసి మద్యాన్ని ప్రధాన ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్నారు. ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటే అదేదో తమకు ప్రజలు పట్టం కట్టినట్టు సంబరాలు జరుపుకుంటున్నారని, వద్దన్నా కొన్నిచోట్ల కొంతమంది తెలుగు తమ్ముళ్లు పోటీకి వెళ్లారని ఆయా స్థానాలను పరిశీలించుకోవాలన్నారు. అధికార పార్టీ కక్షపూరిత చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టిందన్నారు. విజన్‌ ఉన్న చంద్రబాబుతోనే రాష్ట్ర అబివృద్ది సాధ్యమన్నారు. అనంతరం పట్టణ, మండల, అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులను సత్కరించారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మేల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు, కొఠారి దొరబాబు, కొక్కిరిగడ్డ జయరాజు, ఘంటా మురళి, బొరగం శ్రీను, కౌన్సిలర్‌ రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్‌కు మార్‌, షేక్‌ ముస్తఫా, రాజాన సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు, దల్లి కృష్ణారెడ్డి, ఎస్‌ఎస్‌ ఇస్మాయిల్‌, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌ పాల్గొన్నారు.