Abn logo
Sep 22 2021 @ 03:29AM

పార్టీ అండగా ఉంటుంది... భయపడొద్దు

కొప్పర్రు గ్రామాన్ని సందర్శించిన  టీడీపీ నేతలు

మాజీ జెడ్పీటీసీని ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు 


పెదనందిపాడు, గుంటూరు, సెప్టెంబరు 21: మీరు భయపడవద్దు.. ఈ అరాచకం ఎంతోకాలం సాగదు.. పార్టీ మీకు అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు మండలంలోని కొప్పర్రు గ్రామ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కొప్పర్రు గ్రామాన్ని మంగళవారం టీడీపీ నేతలు దూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాకినేని పెదరత్తయ్య సందర్శించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోంమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరగటం బాధాకరమన్నారు. మాజీ జడ్పీటీసీ బత్తిన శారద, ఆమె భర్త వేణులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. ్జకాగా..కొప్పర్రు దాడి ఘటనలో రెండు పార్టీలకు చెందిన 39 మందిపై పెదనందిపాడు పోలీసులు కేసులు నమోదు చేశారు.