Abn logo
Sep 25 2021 @ 02:19AM

విద్యుత్‌ చార్జీలు తగ్గించకపోతే అనిల్‌ ఇంటి ముట్టడి

నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి

కిసాన్‌ నగర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట నిరసన


నెల్లూరు(వ్యవసాయం), సెప్టెంబరు 24 : పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించకపోతే మంత్రి అనిల్‌ ఇంటిని ముట్టడిస్తామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ కిసాన్‌నగర్‌లోని సబ్‌స్టేషన్‌ను శుక్రవారం 4,5,6 డివిజన్లకు చెందిన టీడీపీ నాయకులు ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ ఇస్తే పైసా పన్నులు పెంచకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయల పన్నులను ప్రజలపై రుద్దారని ఆరోపించారు. వందల కోట్లతో విలాసవంతమైన భవంతులు నిర్మించుకున్న మంత్రి అనిల్‌కు ప్రజల కరెంటు చార్జీల బాధలు ఏం తెలుసని ప్రశ్నించారు. విడతలవారీగా ఆందోళనలు చేస్తున్నామని ఈలోగా కరెంటు చార్జీల తగ్గింపుపై ప్రభుత్వం ప్రకటన చేయకపోతే మంత్రి అనిల్‌ నివాసాన్ని ముట్టడించేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మధు, పొత్తూరి శైలజ, నాయకులు రమణయ్య నాయుడు, శ్రీరాములు, రాజా, కృష్ణ, గంగాధర్‌, శంకరయ్య, కాలందర్‌రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, రేవతి, కొమరగిరి విజయ, మంగమ్మ, శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.