Abn logo
Sep 26 2020 @ 13:02PM

టీడీపీకి ఇక కొత్త సారథులు

Kaakateeya

లోక్‌సభ నియోజకవర్గాల వారీ 

కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం

బాపట్లకు అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఏలూరి?

ఒంగోలుకు డాక్టర్‌ ఉగ్ర, బాలాజీ పేర్ల పరిశీలన 

తుది కసరత్తులో అధినేత చంద్రబాబు 


ఒంగోలు, (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ కూ డా లోక్‌సభ నియోజకవర్గాల వారీ కమిటీల ఏర్పాటుకు రంగం సి ద్ధం చేసింది. ఆమేరకు ఒంగోలు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల కు కొత్త అధ్యక్షులను నియమించబోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పే రుని ఆదివారం ప్రకటించబోతోంది. అదే సమయంలో ఒంగోలుతోపా టు, జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్న బాపట్ల లోక్‌సభకు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ఆ పదవికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒంగోలు లోక్‌సభకు కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి, నూకసాని బాలాజీ పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 


రాష్ట్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుకి కూడా రంగం సిద్ధం చేస్తున్న విషయం విదితమే. దీంతో టీడీపీ కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీ పార్టీ, దాని అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుత శాసనసభా పక్ష ఉపనే త అచ్చన్నాయుడు పేరు దాదాపు ఖరారైంది. ఆదివారం ఆయనతోపాటు లోక్‌సభ అధ్యక్షుల పేర్లు కూడా ప్రకటించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా విషయానికొస్తే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్దన్‌ గత ఎన్నికల్లో ఓటమి అనంతరం చురుగ్గా ఉండటం లేదు. కారణాలు ఏమైనప్పటికీ గత కొన్ని నెలలుగా ఒంగోలు కూ డా రాలేదు.  దీంతో పరిస్థితిని సమీక్షించిన అధిష్ఠానం ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావించినట్లు తెలిసింది. 


పార్టీ సహకరిస్తే తనకు ఇబ్బంది లేదన్న ఉగ్ర

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం విషయానికి వస్తే కొం డపిలో పార్టీ ఎమ్మెల్యేగా స్వామి ఉన్నారు. ఆయనకు శాసనసభ విప్‌ పదవి ఇవ్వటంతోపాటు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం పెంచారు. దీంతో మిగిలిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలలో పార్టీ కార్యక్రమాల విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్న కనిగిరి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. గతంలో ఆయనకు డీసీసీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఆ మేరకు ఆయనతో పార్టీలోని కీలక నాయకులు సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది.  తనకున్న కొన్ని ఇబ్బందులను, ఇక్కడి పరిస్థితులను వివరించి ఆ మేరకు రాష్ట్ర పార్టీ సహకారం అందిస్తే తనకు ఇబ్బందిలేదని ఉగ్ర చెప్పినట్లు సమాచారం. మరోవైపు బలహీన, దళిత వర్గాలకు సంబంధించిన వారిని నియమిస్తే ఎలా ఉంటుందని కూడా పరిశీలించారు. యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసిన నూకసాని బాలాజీ పేరుని పరిగణనలోకి తీసుకున్నారు. ఇతరత్రా వనరులు, సమన్వయం విషయంలో ఉన్న లోపాలను  దృష్టిలో ఉంచుకుని లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లు తెలిసింది. ఇక పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పేరును పరిశీలించినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయిలో పార్టీ దళిత విభాగంలో ఆయన్ను వినియోగించుకుంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. 


బాపట్లకు ఏలూరి?

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడిగా ఏలూరి సాంబశివరావు పేరు దాదాపు ఖరారైంది. జిల్లా నుంచి ఏలూరితో పాటు అద్దంకిలో గెలుపొందిన రవికుమార్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని రేపల్లె నుంచి సత్యప్రసాద్‌  ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా గుంటూరు జిల్లాలో 3 మాత్రమే ఉన్నాయి. రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌కు రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం ఇవ్వాలని భావించినట్లు తెలిసింది. దీంతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేరుని కూడా పరిశీలించారు. ఆయన సుముఖత చూపకపోగా, రాష్ట్ర కమిటీలో పనిచేస్తానని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఏలూరితో పాటు అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ పేరుని పరిశీలించారు. పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలం క్రితమే వారితో మాట్లాడినట్లు సమాచారం. ప్రభుత్వం రవికుమార్‌పై  కక్షసాధింపుతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాస్తంత సమయం కేటాయించే అవకాశం ఉన్న ఏలూరికే ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement