Abn logo
Aug 7 2020 @ 03:44AM

‘స్థానిక’ ఆర్డినెన్స్‌ చెల్లదు: టీడీపీ

అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గవర్నర్‌ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌ న్యాయపరంగా చెల్లదని టీడీపీ స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్డికల్‌ 213 (ఏ) ఏ ఆర్డినెన్స్‌నైనా ఆరు నెలల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చుకోవాలి. పంచాయతీరాజ్‌ ఎన్నికలపై ఆరు నెలల కింద గవర్నర్‌ తొలి ఆర్డినెన్స్‌ ఇచ్చారు. కానీ అది అసెంబ్లీలో ఆమోదం పొందలేదు. కొద్ది రోజుల క్రితం అదే అంశంపై గవర్నర్‌తో రెండోసారి ఆర్డినెన్స్‌ ఇప్పించారు. ఒకే అంశంపై జారీఅయిన రెండు ఆర్డినెన్స్‌లు చెల్లవు’ అని టీడీపీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement
Advertisement