Abn logo
Aug 3 2021 @ 23:18PM

టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలి

ఫరూక్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

మార్టూరు, ఆగస్టు 3: పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలని టీడీపీ బాపట్ల పార్లమెంటరీ నియో జకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు పిలుపునిచ్చారు. పర్చూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షునిగా షేక్‌ ఫరూక్‌ను ని యమించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు సోమవారం రాత్రి ఇసుకదర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలి శారు. సాంబశివరావు మాట్లాడుతూ  క్రమశిక్షణ గలిగిన కార్యకర్తలు గా ప్రజా సమస్యలపై  పోరాడుతూ ప్రజలల్లో చైతన్యం తీసుకురావా లన్నారు. కార్యక్రమంలో నాయకులు పోపూరి శ్రీనివాసరావు, కామినేని జనార్దన్‌, షేక్‌ రజాక్‌, పెడవల్లి రామారావు, తొండెపు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి

పర్చూరు, ఆగస్టు 3: టీడీపీ అనుబంధ సంఘాలను బలోపేతం చే సేందుకు సంస్ధాగత నిర్మాణం చేస్తున్నట్లు ఆ పార్టీ బాపట్ల పార్లమెం ట్‌ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఏలూరి సాంబ శివరావు అన్నారు. పార్లమెంట్‌ నూతన కమిటీ సభ్యులుగా నియమితులైన ప లువురు నాయకులు మంగళవారం ఎమ్మె ల్యే ఏలూరిని ఇసుక దర్శి  క్యాంపు కార్యా లయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ  పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ఈక్రమంలో పార్టీ అను బంధ సంఘాలకు కమిటీలను నియమిస్తున్నట్టు చెప్పారు. కార్యక్ర మంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, బాపట్ల పార్ల మెంట్‌ అధికార ప్రతినిధి రావిపాటి సీతయ్య, మీడియా కోఆర్డినేటర్‌ చప్పిడి వెంకట్రావు, ఐటీడీపీ కోఆర్దినేటర్‌ మానం శ్రీనివాసరావు తది తరులు పాల్గొన్నారు.