Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త సంవత్సరం నుంచి... టాటా మోటార్స్.. వాణిజ్య వాహనాల ధరల పెంపు

ముంబై : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల  తయారీ సంస్థ... టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల శ్రేణి ధరలు పెరిగాయి. ఈ మేరకు సంస్థ ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో... వాణిజ్య వాహనాల ధరలు 2.5 % మేర పెరగనున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఇది అమల్లోకి రానున్నాయి. ఎం అండ్ హెచ్‌సీవీ, ఐ అండ్ ఎల్‌సీవీ, బస్ విభాగాలకు ఈ పెంపుదల వర్తించనుంది. అలాగే వాహనం మోడల్, వేరియంట్ ఆధారంగా కూడా ధరల పెరుగుదల ఉంటుంది. ‘ఉక్కు, అల్యూమినియం, ఇతర విలువైన లోహాల ధరల పెరుగుదల, ఇతర ముడిసరుకు వ్యయాలు పెరిగిపోవడంతో... ధరల పెంపు అనివార్యమైంది. అంతేకాకుండా, కంపెనీ... వివిధ స్థాయిలల్లో పెరిగిన వ్యయాల్లో పెద్ద మొత్తాన్ని భరిస్తోంది. తయారీకి సంబంధించి, మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరిగిన నేపధ్యంలో కొంత మేర భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ వివరాలను పొందుపరచింది. కార్ మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియాతో పాటు లగ్జరీ కార్ల తయారీదారులు మెర్సిడెస్-బెంజ్, ఆడి పెరుగుతున్న ఇన్‌పుట్, ఫీచర్ మెరుగుదల ఖర్చులను భర్తీ చేసుకునే క్రమంలో... జనవరి నుంచి ధరలను పెంచనున్నట్లుప్రకటించిన విషయం తెలిసిందే.


కాగా...  జనవరి 2022 నుంచి... ప్లాన్ చేసిన ధరల పెరుగుదల... మోడళ్లను బట్టి మారుతుందని మారుతి వెల్లడించగా, ఫీచర్ మెరుగుదల, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఎంపిక చేసిన మోడళ్లపై 2 % వరకు ధరల పెంపు ఉంటుందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా  వెల్లడించింది.  కాగా... మారుతి ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు వాహనాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. జనవరిలో 1.4 %, ఏప్రిల్‌లో 1.6 %, సెప్టెంబరులో 1.9 %... మొత్తం క్వాంటమ్‌ను 4.9 % కి తీసుకెళ్లింది. కాగా... టాటా మోటార్స్ కంపెనీ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో నుంచి ఎస్‌యూవీ ఎస్-క్రాస్ వరకు పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వాటి ధరలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరుసగా రూ. 3.15 లక్షల నుండి రూ. 12.56 లక్షల వరకు ఉన్నాయి. 

Advertisement
Advertisement