Abn logo
Jul 29 2021 @ 00:19AM

టాటా కార్ల ధరలు పెంపు

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌  వచ్చే వారం నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే స్టీల్‌, ఇతర మెటల్స్‌ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు కంపెనీ ప్రయాణికుల వాహనాల విభాగం ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. తాము కేవలం 2.5 శాతం భారాన్ని మాత్రమే వినియోగదారులకు పంచినట్టు చంద్ర చెప్పారు.