Abn logo
Mar 30 2020 @ 11:37AM

వెంకీకి స్క్రిప్ట్ చెప్పనున్న డైరెక్ట‌ర్‌

విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం ‘నార‌ప్ప’ సినిమాతో బిజిగా ఉన్నాడు. సినిమాలో ప్ర‌ధాన భాగం షూటింగ్ పూర్త‌య్యింది.కరోనా ప్రభావం తర్వాత మిగిలిన భాగం షూటింగ్ పూర్తవుతుంది. దీని త‌ర్వాత వెంక‌టేశ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. కానీ.. ‘పెళ్ళిచూపులు’ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మాత్రం లైన్‌లో ఉన్నాడు. నిజానికి నారప్ప కంటే ముందుగానే ఈ సినిమా స్టార్ట్ కావాల్సింది. అయితే త‌రుణ్ భాస్క‌ర్ చెప్పిన స్ర్క్రిప్ట్‌లో వెంక‌టేశ్ కొన్ని మార్పులు చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. దానికి త‌రుణ్ భాస్క‌ర్ కూడా ఓకే చెప్పి ఆయ‌న చెప్పిన‌ట్లుగా చేంజ‌స్ చేశాడ‌ట‌. త్వరలోనే మ‌రోసారి వెంక‌టేశ్‌ని క‌లిసి స్క్రిప్ట్ చెప్ప‌బోతున్నాడు తరుణ్ భాస్కర్. వెంకీ ఓకే అనేస్తే.. ‘నార‌ప్ప’ త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ సినిమా ట్రాక్ ఎక్కేసిన‌ట్లే. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామగా తెరకెక్కనుంది.

Advertisement
Advertisement
Advertisement