Abn logo
Apr 1 2020 @ 10:02AM

ఎన్టీయార్‌కు కథ చెప్పిన తరుణ్ భాస్కర్?

యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాలో నటిస్తున్నాడు. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాకు ఎన్టీయార్ ఓకే చెప్పాడు. 


పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు `అయిననూ పోయిరావలె హస్తినకు` అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. దీని తర్వాత ఎన్టీయార్ చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. `పెళ్లిచూపులు` డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవల ఎన్టీయార్‌కు కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కథ ఎన్టీయార్‌కు నచ్చిందట. ఆసక్తికరంగా అనిపించిందట. అయితే ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదరితే త్రివిక్రమ్ తర్వాత ఎన్టీయార్‌ను డైరెక్ట్ చేయబోయేది తరుణ్ భాస్కర్ అని సమాచారం.  


Advertisement
Advertisement
Advertisement