Abn logo
Sep 23 2020 @ 18:15PM

ఆరోపణలు నిజమైతే కశ్యప్‌ నుంచి విడిపోయేది మొదట నేనే: తాప్సీ

Kaakateeya

ముంబై: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు విని తాను తీవ్ర మనోవేధనకు గురయ్యానని చెప్పుకొచ్చిన నటి తాప్సీ.. ఆ ఆరోపణలు నిజమైతే కశ్యప్‌తో అన్ని సంబంధాలు తెంపుకునే మొదటి వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. లైంగిక ఆరోపణలు వచ్చిన వెంటనే కశ్యప్‌కు మద్దతుగా మాట్లాడిన మొదటి వ్యక్తి కూడా తాప్సీనే. తనకెప్పుడూ కశ్యప్ అలా కనిపించలేదని, నిజానికి కశ్యప్ అతిపెద్ద స్త్రీవాదని తాప్సీ వెనకేసుకొచ్చింది.


‘‘నిజంగానే ఎవరిపైనైనా లైంగిక హింస జరిగినట్లైతే దానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. అంతే కానీ ఎవరికివారు తీర్పులు ఇవ్వకూడదు. ఒకవేళ కశ్యప్‌పై వచ్చే ఆరోపణలు నిజమని తేలితే అతడితో అన్ని రకాల సంబంధాలు తెంచుకునే మొదటి వ్యక్తి నేనే. దర్యాప్తు సరిగా జరక్కపోతే ‘మీటూ’ ఉద్యమం అర్థవంతంగా ఎలా కొనసాగుతుంది? సంవత్సరాల అణచివేత తర్వాత మహిళలకు దొరికిన చక్కటి అవకాశం. దీనిని తప్పుదారి పట్టిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది?’’ అని తాప్సీ చెప్పింది.


కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఐదేళ్ల క్రితం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పాయల్ ఘోష్ అనే నటి ఆరోపించింది. కాగా తాప్సీ సహా పలువురు నటులు కశ్యాప్‌కు మద్దతుగా నిలిచారు. అనంతరం తాజాగా మరో నటి కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసింది.

Advertisement
Advertisement
Advertisement