Abn logo
Jun 1 2020 @ 08:56AM

సూపర్ ఉమెన్‌గా తాప్సీ

సూప‌ర్‌మ్యాన్‌, బ్యాట్‌మాన్‌, స్పైడ‌ర్ మ్యాన్ ఇలా సూప‌ర్ హీరోల క‌థ‌ల‌తో తెర‌కెక్కిన సినిమాల‌న్నీ మంచి విజ‌యాల‌ను సాధించిన‌వే. ఇదే కోవ‌లో వండ‌ర్ ఉమెన్ వంటి సూప‌ర్ ఉమెన్ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డిస్నీ మ‌రో సూప‌ర్ ఉమెన్ క‌థ‌ను సిద్ధం చేసింద‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇది భార‌త‌దేశంలో జ‌రిగే సూప‌ర్ ఉమెన్ క‌థ‌. దీంతో నిర్మాణ సంస్థ ఎవ‌రో హాలీవుడ్ తార‌ల‌ను కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్‌ని ఇందులో న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ప‌లువురు స్టార్ హీరోయిన్స్‌ను ఆడిష‌న్స్ చేస్తున్నార‌ట‌. సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ ఆడిష‌న్స్‌లో తాప్సీ పాల్గొంటుందట‌. ఆడిష‌న్స్‌లో తాప్సీ మెప్పించ‌గ‌లిగితే మ‌నం తాప్సీని సూప‌ర్ ఉమెన్ పాత్ర‌లో చూసే అవ‌కాశం ఉంటుంది. 

Advertisement
Advertisement
Advertisement