Abn logo
Sep 21 2021 @ 23:36PM

నిరుపయోగంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌

తణుకు బైపాస్‌ రోడ్డులో నిరుపయోగంగా వున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌

అద్దె ఎక్కువంటూ.. ముందుకు రాని వైనం 

ఆదాయం కోల్పోతున్న మునిసిపాలిటీ

తణుకు, సెప్టెంబరు 21: తణుకు బైపాస్‌ రోడ్డులోని పాత టోల్‌గేట్‌ వద్ద నిర్మించిన వాణిజ్య సముదాయాలు నిరుపయోగంగా ఉన్నాయి. 2019 గత ప్రభుత్వ హయాంలో మునిసిపల్‌ నిధులు రూ.3.10 కోట్లతో యలమర్తి నారాయణరావు చౌదరి పేరు మీద షాపింగ్స్‌ కాంప్లెక్సు భవనాలు నిర్మించారు. అద్దెలు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరూ ముందుకు రావడం లేదు. సుమారు ఇరవై షాపుల వరకు నిరుపయోగంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండడం వల్ల మునిసిపాలిటీ ఆదాయం కోల్పోవడంతో పాటు భవనాలు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.