Abn logo
Aug 3 2021 @ 23:12PM

తణుకు ఆస్పత్రికి రాష్ట్రస్థాయి ప్రశంస

తణుకు, ఆగస్టు 3: సేవలు ప్రామాణికంగా రాష్ట్ర స్థాయిలో తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి నెల ఆసుపత్రుల్లో అందించే సేవలను బట్టి గుర్తించడం జరుగుతుంది. ప్రధానంగా ఆసుపత్రిలో అందించే సేవల్లో ముఖ్యంగా పేషెంట్లకు అందించే సౌకర్యాలు కొలమానంగా ఉంటాయి. ఆపరేషన్లు, యాక్సిడింట్‌ కేసులు, ప్రసవాలు, చిన్నపిల్లలు, స్కానింగ్‌, రక్తపరీక్షలు, వోపీ, ఇన్‌పేషెంట్లు, ఎక్స్‌రేలు, ఈసీజీతో పాటు ఇతర సేవలను బట్టి నిర్ణయిస్తారు. జూన్‌ నెలకు సంబంధించి రాష్ట్రంలో 17 జిల్లా ఆసుపత్రులు ఉండగా తణుకు జిల్లా ఆసుపత్రికి ప్రథమ స్థానం, చిత్తూరు జిల్లా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి ద్వితీయ స్థానం, విజయనగరం జిల్లా ఆసుపత్రికి తృతీయ స్థానం లభించింది. ప్రతినెలా సేవలను బట్టి స్థానాలను వైద్యఆరోగ్యశాఖ ప్రకటిస్తుంది. ప్రథమ స్థానం రావడం పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది అంతా పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రశంసల వల్ల తాము మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందన్నారు.