Abn logo
Jul 15 2020 @ 08:49AM

'తానా' ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి ఫోటో కవితల పోటీలు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ  ఫోటోగ్రఫీ దినోత్సవం (ఆగష్టు 19) సందర్భంగా ప్రపంచస్థాయి ఫోటో కవితల పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీలలో విజేతలకు మొత్తం లక్ష రూపాయిలు నగదు బహుమతులుగా అందజేస్తున్నామని  తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, ప్రపంచ సాహిత్య వేదిక సారథి డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. 


ప్రథమ బహుమతి - రూ . 30,000/-

ద్వితీయ బహుమతి - రూ . 20,000/-

తృతీయ బహుమతి - రూ . 10,000/-

అలాగే మరో పది మంది రచయితలకు రూ . 4,000/-  చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు. 


ఈ కవితల పోటీలకు సమన్వయకర్తగా ఉన్న‌ చిగురుమళ్ల శ్రీనివాస్ వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలియజేశారు.

పైన ఇచ్చిన రెండు ఫొటోలోని దృశ్యాలను సమన్వయం చేస్తూ కవిత రాయాలి. 

అలాగే కవితలు 20 పంక్తులు మించకుండా ఉండాలి 

కవితలు పంపవలసిన చివరి తేదీ జులై 26, 2020

కవితలు పంపవలసిన వాట్సాప్ నెంబర్ - ‪+ 91-9121081595‬

మిగిలిన వివరాలకు www.tana.org వెబ్‌సైట్‌ను సందర్శించాల‌ని తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement