Abn logo
Oct 11 2021 @ 21:13PM

విజయవంతంగా ముగిసిన తానా చెస్ పోటీలు

వివిధ విభాగాల్లో తానా  ఏర్పాటు చేసిన చెస్ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా ముగిసాయి. సుమారు నూట పదిహేను మందికి పైగా ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 10 , అండర్ 14 , అండర్ 18 మరియు 18 + వయస్సుల వారికీ ఈ పోటీలు నిర్వహించారు . ఆన్లైన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎక్కువగా అండర్ 10 విభాగం లో చిన్నారులు పాల్గొనటం విశేషం. తానా కాపిటల్ రీజియన్ వారు నిర్వహించిన ఈ పోటీలలో అమెరికా నుండే కాకుండా కెనడా నుండి కూడా క్రీడాకారులు పాల్గొన్నారు. తానా కాపిటల్ రీజినల్ కోఆర్డినేటర్ ఉయ్యురు శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు అందరికి బహుమతులు అందచేయటం జరుగుతుందని తెలిపారు. 

అలాగే టెక్నికెల్ సపోర్ట్ చేసిన సిద్ధార్ధ్ జాస్తి, ఈవెంట్ కోఆర్డినేట్ చేసిన సతీష్ మేకాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ  పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలేనని, అందరిలోనూ చూసిన క్రీడా స్ఫూర్తి అభినందనీయమని, వారి క్రీడా స్ఫూర్తి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యటానికి ఉత్సాహం ఇస్తుందని, చిన్నారులకి ప్రోత్సహించిన తల్లిదండ్రులుకి, అలాగే అద్భుతంగా  ఈ కార్యక్రమం నిర్వహించిన తానా కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉయ్యురు, వారి బృందాన్ని  ప్రత్యేకంగా అభినందించి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ తానా లీడర్షిప్ తరుపున సహకారం ఉంటుందని తెలిపారు

తాజా వార్తలుమరిన్ని...