Abn logo
Aug 8 2020 @ 19:11PM

తమిళనాడులో మరో ఎమ్మెల్యేకు కరోనా..!

చెన్నై: తమిళనాడు శాసనసభ సభ్యులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రతిపక్ష డీఎమ్‌కే పార్టీ ఎమ్మెల్యే టీకేజీ నీలమేగమ్‌ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం తంజావూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  అంతకుమనుపే నీలమేగన్.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మరో ఎమ్మేల్యేను కలవడంతో కొన్ని రోజులుగా ఆయన ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకూ ప్రతిపక్ష డీఎమ్‌కే చెందిన మొత్తం 13 మంది శాసనసభ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అధికార పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను కూడా కరోనా కాటేసింది. వీరిలో డీఎమ్‌కే ఎమ్మెల్యే అన్బళగన్ అనే శాసనసభ్యుడు కరోనాతో జూన్ 10న మృతి చెందారు. 

Advertisement
Advertisement
Advertisement