Abn logo
Oct 24 2020 @ 13:03PM

‘ఉచిత వ్యాక్సిన్’ అని ప్రకటించిన పాండిచ్చేరి, తమిళనాడు

Kaakateeya

పాండిచ్చేరి : ‘ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్’ ఒక్కో రాష్ట్రం ఈ నినాదాన్ని ఎత్తుకుంటోంది. మొదట ఈ హామీని బీజేపీ ప్రకటిస్తే.... ఇక ఒక్కోరాష్ట్రం దాన్ని అందుకుంటోంది. తాజాగా పాండిచ్చేరి ప్రభుత్వం ఈ జాబితాలో వచ్చి చేరింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా, ఇవ్వకపోయినా... తాము మాత్రం రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. కరోనా అనేది మశూచి, పోలియో లాంటిదని, అందుకే ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ఆయన తెలిపారు. ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ‘‘వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందజేస్తాం.’’ అని పళని స్వామి ప్రకటించారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement