Abn logo
Mar 26 2020 @ 11:24AM

ఈ 21 రోజులను అలా వాడుకుందాం: తమన్నా

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రస్తుతం అందరూ కరోనా గురించే మాట్లాడుతున్నారు. సినీ ప్రముఖులందరూ కరోనా గురించి, ఆ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిల్కీ బ్యూటీ తమన్నా సూచించింది. 


`ఇంటికే పరిమితమవ్వాల్సిన ఈ 21 రోజులను సద్వినియోగం చేసుకుంటా. ఇన్ని రోజులూ చేద్దామనుకుని చేయలేకపోయిన పనుల కోసం ఈ సమయాన్ని కేటాయిస్తా. నా జీవ నశైలిని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తా. మనం ఏదైనా ఒక అలవాటు చేసుకోవాలంటే 21 రోజులు అవసరమట. ఈ సమయాన్ని మంచి అలవాట్లు అలవర్చుకునేందుకు ఎందుకు వాడుకోకూడదు?` అని తమన్నా పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement