Advertisement

కాజల్ ప్లేస్‌లో మిల్కీ బ్యూటీ?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఇండియన్ స్ర్కీన్ కే మోస్ట్ వాంటెండ్ టాలెంటెడ్ బ్యూటీ. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో పాటు .. బాలీవుడ్ లోనూ అమ్మడు యాక్టివ్. ప్రస్తుతం చిరు ‘భోళాశంకర్’ లో కథానాయికగా నటిస్తోన్న తమ్మూ.. ఇప్పుడో క్రేజీ మూవీలో కథానాయికగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ సినిమా కమల్ ‘ఇండియన్ 2’ అవడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ లో  కాజల్ అగర్వాల్ కథానాయికగా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రెగ్నెంట్ కారణంగా ఆమె ప్లేస్ ను ఇప్పుడు తమన్నా రీప్లేస్ చేయనుండడం విశేషం.


శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఎప్పుడో ప్రారంభమైన కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూటింగ్ కు  కొన్ని వివాదాల కారణంగా బ్రేక్ వచ్చింది. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కావడంతో త్వరలోనే సినిమాను తిరిగి పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది. మరో పక్క రామ్ చరణ్ తో సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్న శంకర్ .. ఆ సినిమాకి కొన్నిరోజుల పాటు బ్రేకిచ్చి.. ‘ఇండియన్ 2’ సినిమా షూట్ ను రీస్టార్ట్ చేయబోతున్నారు. పనిలో పనిగా కథానాయికగా తమన్నాను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతోంది. మరి తమ్మూ చేరిక ‘ఇండియన్ 2’ మూవీకి అడ్వాంటేజ్ అవుతుందేమో చూడాలి. 

Advertisement
Advertisement