Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘న్యాయవాద దంపతుల హత్య ఘటనపై కేసీఆర్ స్పందనేది?’

హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజి ఆచారి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోం మంత్రి, డీజీపీ నోరు ఎందుకు మెదపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను సమర్ధించే విధంగా వారు వ్యవహరిస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వాలన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని తల్లోజి ఆచారి కోరారు.


Advertisement
Advertisement