Abn logo
Jun 3 2020 @ 17:57PM

సినీ పరిశ్రమ విషయంలో కేసిఆర్‌గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు : తలసాని సాయి కిరణ్ యాదవ్

తలసాని ట్రస్ట్‌ ఆద్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించిన తలసాని సాయి కిరణ్ ,ఇకముందు కూడా ఇలానే కార్మికులను ఆదుకుంటామన్నారు. హైదరాబాదు ఫిలిం చాంబర్ లో ఏర్పాటు  ఈ కార్యక్రమంలో సి‌.కల్యాణ్, అభిషేక్ నామా పాల్గొన్నారు.   ముందుగా సి కల్యాణ్ మాట్లాడుతూ ‘‘తలసానిగారితో 30ఏళ్ల అనుబంధం.. రాజకీయంగా తలసాని గారు  ఎదిగినా.. మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది సినీ కార్మికులకు అండంగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సినీ పరిశ్రమకు అండంగా తలసానిగారిలా మరెవరు లేరు.సిఎం కేసిఆర్ కూడా మా పరిస్థితులను అర్దం చేసుకున్నారు.‌అతి త్వరలోనే చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘తలసాని శ్రీనివాస్‌గారు మా నిర్మాతలకు ఎంతో అండంగా ఉన్నారు  తలసాని సాయిగారు తమ ట్రస్ట్ ద్వారా కార్మికులను ఆదుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ధన్యవాదాలు‘‘ అన్నారు.


తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ ‘‘తెలంగాణాను సాధించటంతో పాటు, రాష్టాన్ని అభివృద్ధి పదంలో కేసీఆర్‌గారు నడిపిస్తున్నారు.అలాగే సినీ పరిశ్రమ విషయంలో కూడా కేసీఆర్‌గారు ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తలసాని శ్రీనివాస్‌గారికి సినిమాలంటే ప్రేమ ప్రతి సినిమాను తొలిరోజు చూస్తారు. ఈరోజు చిరంజీవి, నాగార్జున ,మిగతా అసోషియేషన్స్ అంతా కలిసి లీడ్ తీసుకుని చిత్రీకరణ విషయంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే సి.సి.సి ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటున్నాం’’ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement