Abn logo
Jul 29 2021 @ 00:02AM

వలంటీర్‌ దిలీప్‌ను ఆదర్శంగా తీసుకోండి

దిలీప్‌కు ప్రశంసాపత్రం అందిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌


శ్రీకాకుళంఆంధ్రజ్యోతి/పాలకొండ: సమయ స్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన వలంటీర్‌ రాయపల్లి దిలీప్‌కు ఎస్పీ  అమిత్‌బర్దర్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం సన్మానించారు. సకాలంలో స్పందించి  ప్రాణా లు కాపాడిన  దిలీప్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ కో రారు. కాగా పాలకొండ-వీరఘట్టం రహదా రిలో వీరఘట్టం సిటికేబుల్‌ యజమాని కొత్తకోట ఆంజనేయులు  భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై మంగళవారం రాత్రి వెళ్తున్నాడు. వెంకమ్మపేట వద్ద మరియగిరి సమీపంలో బోల్తాపడడంతో  ఆంజనేయులకు గాయాలయ్యాయి. నడిరోడ్డుపై రక్తం మడుగులో ఉన్న ఆంజనేయులు సాయంకోసం ఎదురుచూ స్తున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వలంటీర్‌ దిలీప్‌  స్పందించి ఆటోలో  వీరఘట్టం పీహెచ్‌సీకి ప్రథమ చికిత్స కోసం తరలించాడు.